
చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ వదిలేసిన సినిమాలలో త్రిష నటించి ఫ్లాప్ మూట కట్టుకోవడం అందరికీ తెలిసిందే . ఆ గొడవలు పెద్ద కొత్తెం కాదు . 40 ప్లస్ లో కూడా ఇద్దరు నువ్వా - నేనా అన్నట్టు సినిమాలకు కమిట్ అవ్వడం ..రెమ్యూనరేషన్ల్ లో కూడా పోటాపోటీగా తీసుకుంటూ ఉండడం గమనార్హం. అయితే త్రిష - నయనతారల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమటుంది అనేలా పరిస్థితి తయారయింది. నిజానికి ఈ గొడవ ఇప్పటిది కాదు అప్పుడెప్పుడో విజయ దళపతి "కురివి" మూవీ నుండి వీళ్ల స్నేహం చెడ్డింది అని కోలీవుడ్లో టాక్ .
కాగా ఈ సినిమా కోసం ఫస్ట్ నయనతారను ఆఫర్ చేస్తే.. దగ్గ ల తన్నుకుపోయింది త్రిష అంటూ అప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా కోడై కూసింది. ఆ తర్వాత అది చిలికి చిలికి పెద్ద గాలి వానలా మారింది. అయితే నయనతార చేసే రోల్స్ అన్నీ కూడా మొదటగా త్రిష వద్దకు వచ్చి ఆమె రిజెక్ట్ చేస్తే నయనతార సెలెక్ట్ అయింది . ఆశ్చర్యం ఏంటంటే అలా సెలెక్ట్ చేసుకున్న పాత్రలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ . నయనతార వదిలేసిన ప్రాజెక్టులన్ని కూడా త్రిష చేసి ఫ్లాప్స్ మూట కట్టుకుంటుంది . సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోద్దాం అని ట్రై చేస్తున్న త్రిష కు ఎక్కడికక్కడ బ్రేక్ వేసేస్తుంది నయనతార . నిజానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిస్తున్న సినిమా కోసం ముందుగా త్రిష ని అనుకున్నారట . కానీ కొన్ని కారణాలు చేత ఆమెను వద్దనుకున్నారట.
విశ్వంభర సినిమాలో ఆల్రెడీ త్రిష నటిస్తుంది. చిరంజీవితో మళ్ళీ అదే కొంబో ఎందుకు..?? అంటూ క్యాన్సిల్ చేశారట . అయితే ఆ ప్లేస్ లోకి నయనతార వచ్చింది. విశ్వంభర సినిమాపై ఎలాంటి బజ్ ఉందో అందరికి తెలుసు. అదే మెగా 157 సినిమా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో అందరికీ తెలుసు. అలా త్రిషకు ఎక్కడికి వెళ్లినా సరే కాంపిటీషన్ గా తయారైపోయింది నయనతార అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఇద్దరు 10 - 12 - 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారట . అంతేకాదు త్రిషకు క్లోజ్ గా ఉండి ఆమెను పొగిడేసే ఏ దర్శకుడికి నయనతార ఛాన్స్ ఇవ్వడం లేదు.. అదేవిధంగా త్రిష కూడా చేస్తుంది. దీనితో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది అంటున్నారు కోలీవుడ్ జనాలు . కొంతమంది మీరు సవతుల్లా కొట్లాడుకుంటున్నారు ..ఎడికేటెడ్ స్టార్ హీరోయిన్స్ గా.. ఆమాత్రం మినిమం కామన్ సెన్స్ ఉండదా ..? అంటూ మాట్లాడుకుంటున్నారు . చూడాలి మరి వీరి పోటా పోటీ తత్వం ఇంకెన్ని రోజులు ముందుకు వెళుతుంది అనేది..???