విజ‌య‌వాడ బందరు రోడ్డులోని ఓ పబ్‌లో సింగర్‌గా పనిచేస్తున్న మహిళ తన మాయాజాలంతో ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుని, బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సంగీతం పేరుతో వచ్చి… ప్రేమ పేరుతో ట్రాప్ వేసి… పెళ్లి పేరుతో డబ్బులు కొల్లగొట్టిన ఈ స్కాం ఇప్పుడు సంచలనంగా మారింది . ఈ మహిళ సుమారు 20 సంవత్సరాల క్రితం తొలి వివాహం చేసుకుంది. అయితే భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత జీవనాధారంగా పబ్‌లో సింగర్‌గా చేరింది. అక్కడకు వచ్చే వినియోగదారులతో సన్నిహితంగా మెలగుతూ, వారిలో కొంతమందిని ప్రేమలో పడేసి మోసం చేయడం మొదలుపెట్టింది .


ఒక్కరికొకరిది తెలియకుండా వరుసగా ఆరుగురిని వివాహం చేసుకుంది . వివాహం తరువాత ప్రేమ చూపు తో మోహించి, మెల్లగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం సేకరించి … ఆ తర్వాత అదే ఆధారంగా బ్లాక్‌మెయిల్ చేయడం ఆమె ప్రధాన టెక్నిక్. “నీ ఫోటోలు బయటపెడతా… నీ కుటుంబానికి చెబుతా…” అంటూ బెదిరింపులు చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేసింది . ఈ నాటకం చాలా కాలంగా నడుస్తున్నా, ఎవరూ బయటకు చెప్పలేక బాధతో ఉండిపోయారు. కానీ తాజాగా కొత్తపేటకు చెందిన ఓ బాధితుడు ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేయడం తో అసలు బాగోతం బయటపడింది . పోలీసులు విచారణ ప్రారంభించ గా ఇప్పటివరకు ఆరుగురిని వివాహం చేసుకుందని తేలింది. బాధితుల నుంచి లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.


ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరి పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . త్వరలోనే వారి కదలికల పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవలకాలంలో పెళ్లి పేరుతో మోసం చేసే ఘటనలు పెరుగుతుండటం తో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ పేరుతో వల వేసే వ్యక్తుల పై భద్రతతో, జాగ్రత్తగా మెలగాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: