ఈ మధ్య కాలంలో  ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ లో ఒకటైన ఇన్ స్టాగ్రామ్ వినియోగం అంతకంతకూ  పెరుగుతోంది.   ఇన్ స్టాగ్రామ్ లో  ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి కొంతమంది చేస్తున్న చేష్టలు సైతం  విమర్శల పాలవుతుండటం గమనార్హం.  కొంతమంది హద్దులు దాటి ఎక్స్ పోజింగ్ చేయడం  ద్వారా  సోషల్ మీడియాలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని  ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యమైన కంటెంట్ విషయంలో ఒకింత తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.  కొంతమంది ఫాలోవర్స్  ను పెంచుకోవడం కోసం బూతులపై ఆధారపడుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి.  అయితే  తాజాగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్  చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను  పోలీసులు అరెస్ట్ చేయడం సోషల్ మీడియా  వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

వల్గర్ డైలాగ్స్ తో, అభ్యకరమైన కంటెంట్ తో  పోస్టులు ఉండటంతో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేయడం  జరిగింది.  యూపీ  పోలీసులు సుమోటాగా కేసును స్వీకరించి  ఈ అక్కాచెల్లెళ్లను అరెస్ట్  చేశారు.  ఇన్ స్టాగ్రామ్  వేదికగా మార్ఫ్ చేసిన ఫోటోలు సైతం వైరల్ అవుతుండటంపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.  డబ్బుల కోసం కొంతమంది ఈ ఇన్ స్టాగ్రామ్ పై ఆధారపడ్డారు.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్  సైతం  కంటెంట్ విషయంలో నిబంధనలకు పాతరేశాయి.  సోషల్ మీడియా ఖాతాలలో  సెమీ న్యూడ్ కంటెంట్,  బూతు డైలాగ్స్, హాట్ ఫోజులకు ప్రాధాన్యత ఇవ్వడంపై  విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   ఏఐ వినియోగంతో  అశ్లీల, అసభ్య   కంటెంట్  అంతకంతకూ పెరుగుతోందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో కఠిన చట్టాలు అమలులోకి వస్తే బాగుంటుందని  కామెంట్లు  వినిపిస్తున్నాయి.  

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: