ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమంత రెండో పెళ్లి కి సమయం రానే వచ్చింది అంటున్నారు ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్లు.. తాజాగా సమంతకి సంబంధించిన పెళ్లికూతురు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటోలు చూసి చాలామంది నెటిజన్స్ షాక్ అయిపోతున్నారు.ఇక విషయంలోకి వెళ్తే.. నాగచైతన్యతో ప్రేమ పెళ్లి విడాకుల తర్వాత సమంత తన లైఫ్ లో ఎన్నో కష్టాలు అనుభవించింది.ముఖ్యంగా మయోసైటిస్ తో పోరాడి బక్క చిక్కిపోయి బలహీనంగా మారి అసలు సమంత ఒంట్లో ఎముకలు ఉన్నాయా అనేలా తయారయ్యింది. కానీ మయోసైటిస్ ని తట్టుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, సొంతవాళ్ల అండదండలతో సమంత మళ్ళీ తిరిగి కోలుకుంది.అలా మయో సైటీస్ తర్వాత ఖుషి,శాకుంతలం,యశోద వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది.అలాగే రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్  మా ఇంటి బంగారం సినిమాని ఓకే చేసింది. 

ఇక రీసెంట్గా సమంత నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం బ్లాక్బస్టర్ హిట్ అయింది. దాంతో సమంతకు ప్రొడ్యూసర్ గా కూడా భాద్యతలు పెరిగాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ లలో ఒకరైనటువంటి రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. అయితే చాలా రోజుల నుండి రాజ్ నిడిమోరుతో సమంత లవ్ లో ఉంది అనే రూమర్స్ వినిపించినప్పటికీ దానికి సంబంధించి ఎక్కడా కూడా క్లూస్ దొరకలేదు. కానీ నాగచైతన్య ఎప్పుడైతే రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం బయటపడిందో అప్పటినుండి సమంత కూడా తన రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వదిలింది. దాంతో ఇన్ని రోజులుగా లేని ఈ ఫోటోలు ఇప్పుడెలా ప్రత్యక్షమయ్యాయి అని చాలామంది భావించారు.
ఇక రూమర్లను  నిజం చేస్తూ ఎక్కడికి వెళ్లినా సరే రాజ్ నిడిమోరుతో కలిసి ప్రయాణం చేస్తూ ఆయన చేతిలో చెయ్యేస్తూ క్లోజ్ గా ఉన్న ఫోటోలను కూడా వైరల్ చేస్తుంది. అంతే కాకుండా రాజ్ మొదటి భార్య గతంలో సోషల్ మీడియాలో అంత యాక్టివా ఉండకపోయేది.కానీ ఎప్పుడైతే సమంత తో రాజ్ డేటింగ్ చేస్తున్నారని తెలిసిందో అప్పటినుండి ఆమె వీరి రిలేషన్ ని ఉద్దేశిస్తూ షాకింగ్ పోస్ట్లు కూడా పెడుతుంది.అలా వీరిద్దరి రెండో పెళ్లి వార్తలకు ఊతమిచ్చేలా ఎన్నో జరిగాయి. అయితే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోల్లో అచ్చం పెళ్లికూతురు గెటప్ లో సమంత రెడీ అయి ఉంది.దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు సమంత రెండో పెళ్లికి వేళాయరా.. సమంత రెండో పెళ్లి జరగబోతుంది.. దానికి సాక్ష్యం ఈ పెళ్లికూతురు ఫోటోలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి సమంత పెళ్లి గెటప్ లో ఉన్నవి ఆమె రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలేనా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: