
సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాలు సక్సెస్ సాధించడం అరుదుగా జరుగుతుంది. ఈ రీజన్ వల్లే ఓజీ సినిమాకు రికార్డ్ స్థాయిలో ఆఫర్లు వస్తున్నా హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం అదే స్థాయిలో బిజినెస్ జరగడం లేదు. ఈ కారణం వల్ల బయ్యర్ల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో మెజారిటీ ఏరియాలలో ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తుండటం గమనార్హం.
అయితే సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకంతో వీరమల్లు బిజినెస్ విషయంలో నిర్మాత రిస్క్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతులు ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు 200 రూపాయలు, అప్పర్ క్లాస్ 150 రూపాయలు, లోయర్ క్లాస్ 100 రూపాయల వరకు టికెట్ రేట్ల పెంపు ఉండనుందని సమాచారం అందుంటోంది.
అయితే సినిమా విషయంలో నిర్మాతల నమ్మకం నిజమవుతుందో లేక బయ్యర్ల నిర్ణయమే నిజమవుతుందో చూడాల్సి ఉంది. దాదాపుగా ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సక్సెస్ సాధించడం పవన్ కెరీర్ కు కూడా కీలకమవుతుంది. హరిహర వీరమల్లు సెకండ్ పార్టీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది. ఖుషీలా వీరమల్లు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే నిధి అగర్వాల్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు సినిమాలో ట్విస్టులు ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద కూడా వీరమల్లు కావాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.