ప్రముఖ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న హన్సిక విడాకులు తీసుకోబోతోంది అంటూ ఒక వార్త తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె తన భర్త సోహెల్ కతురియా నుంచి దూరంగా నివసిస్తున్నారని కథనాలు కూడా వస్తున్నాయి. 2023 నుంచి సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఉన్న పోస్టులను కూడా హన్సిక షేర్ చేయడం లేదు. మొదట వివాహ వార్షికోత్సవాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం , అప్పటికి సంబంధించిన ఫోటోలు మాత్రమే షేర్ చేయడంతో ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను కానీ తన భర్తతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని కానీ ఆమె ఏ మాత్రం అభిమానులతో పంచుకోవడం లేదు.

దీనికి తోడు హన్సిక తన తల్లితో కలిసి ఉంటే సోహెల్ విడిగా తన కుటుంబంతో ఉన్నట్లు సమాచారం. ఇక పెళ్లైన ఏడాది తర్వాత సోహెల్ కుటుంబంతో సర్దుబాటులో హన్సికకు సమస్యలు వచ్చాయని,  అందుకే ఆమె విడిగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కతురియా పెద్ద కుటుంబంతో హన్సిక ఉండలేకపోతోంది అనే ఒక వార్త కూడా తెరపైకి రావడం గమనార్హం.  దీంతో రెండేళ్ల వైవాహిక బంధం లోనే సమస్యలు తలెత్తాయని,  విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హన్సిక భర్త క్లారిటీ ఇచ్చారు.

ఆయన చాలా సింపుల్గా ఇది నిజం కాదు అంటూ కొట్టి పారేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన విడాకులు అంటూ వస్తున్న వార్తలపై నోరు విప్పారు.  డిసెంబర్ 2022లో ఈ జంట వివాహం చేసుకున్న తర్వాత వీరిద్దరూ కాండోలోకి మారారు. ఇక ఆ తర్వాత సంతోషంగా ఉన్నారనుకున్నారు. కానీ వీరికి సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు రాకపోవడంతో నిజంగానే విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సోహెల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: