సినిమాలు వేరు రాజకీయాలు వేరు.. రెండింటిని కలిపి చూడకూడదు , ఎక్కడిది అక్కడే వదిలేయాలి . ఈ మినిమం కామన్ సెన్స్ లేకుండా కొంతమంది పాలిటిక్స్ ని సినిమాలోకి కలుపుతూ పాలిటిక్స్ పగలను సినిమాలపై రుద్దడానికి చూస్తున్నారు.  మరీ ముఖ్యంగా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో "హరిహర వీరమల్లు" సినిమా రిలీజ్ అవ్వబోతున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ పై పీకల్లోతు పగ పెంచుకున్న వైసీపీ నేతలు , కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమాని "Boycott"  చేయాలి అంటూ హ్యాష్ ట్యాగ్స్  ట్రెండ్ చేస్తున్నారు .


అంతేకాదు మరి కొంతమంది మరింత రెచ్చిపోయి సిగ్గు ఉన్న ఏ వైసీపీ అభిమాని హరిహర వీరమల్లు సినిమాని చూడనే చూడడు అంటూ రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి.  అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  పవన్ కళ్యాణ్ నిజమైన అభిమాని సినిమా చూస్తాడు అని ..పవన్ కళ్యాణ్ ని ఎవ్వడు ఏమి పీకలేడు అని ..హరిహర వీరమల్లు సినిమా చాలా కష్టపడి మేకర్స్ తెరకెక్కించారు  అని ..వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది అని సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు .



ఎవరైతే సోషల్ మీడియాలో "హరిహర వీరమల్లు" Boycott చేయాలి అంటూన్నారో వాళ్ళందరికీ గూబ పగిలిపోయేలా కౌంటర్స్ వేస్తున్నారు . వైసిపి కార్యకర్తలు , నేతలు చూడనంత మాత్రాన సినిమా ఏం ఫ్లాప్ అవ్వదు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు "హరిహర వీరమల్లు" సినిమా హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . పవన్ పొలిటికల్ పరంగా సక్సెస్ అవ్వడమే దీనికి మెయిన్ కారణం . ఆయన పొలిటికల్ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది ఆయనను హేట్ చేసే నాయకులు ఈ విధంగా సినిమాల పరంగా దెబ్బతీయాలని చూస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . చూడాలి మరి ఇన్ని  నెగిటివిటీల మధ్య ఫుల్ ధీమా తో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి ఎటువంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో...??



మరింత సమాచారం తెలుసుకోండి: