పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించి ఎక్కువ శాతం రాజకీయాలతోనే బిజీ అయ్యాడు. కానీ రాజకీయాలతో బిజీగా ఉన్న కొన్ని సినిమాలకు కమిట్ అవుతూ వచ్చాడు. అందులో భాగంగా పవన్ కొంత కాలం క్రితం హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు మూవీలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలను స్టార్ట్ చేశాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ల హడావిడి మొదలైంది. దానితో ఈ మూడు సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ అద్భుతమైన రీతిలో సక్సెస్ కూడా అయ్యాడు. ఎలక్షన్లు ముగిసిన తర్వాత పవన్ ఈ మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు , ఓజి సినిమాలను కంప్లీట్ చేశాడు. మరికొన్ని రోజుల్లోనే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని కూడా కంప్లీట్ చేయనున్నాడు. హరిహర వీరమల్లు సినిమా రేపు అనగా జూలై 24 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పవన్ వరుస పెట్టి ఇంటర్వ్యూలను ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా పవన్ మాట్లాడుతూ  ... ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక నిర్మాతగా మారుతాను అని పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. సినిమాలతోనే నా జీవితం ముడి పడి ఉంది. కానీ ఇకపై నేను సినిమాల్లో నటించకపోవచ్చు. కాకపోతే నేను చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ను స్థాపించాను. కానీ ఆ బ్యానర్ లో సినిమాలను నిర్మించలేదు. ఇకపై ఆ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తాను అని పవన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: