టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాను కంప్లీట్ చేయడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకుంటూ ఉంటాడు. దాదాపు ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో సినిమాను మొదలు పెడుతూ ఉంటాడు. ఇక పవన్ కూడా ఆల్మోస్ట్ తన అన్న అయినటువంటి చిరంజీవి దారిలోనే ఎక్కువ శాతం నడుస్తూ ఉంటాడు.

ఆయన కూడా ఒక సినిమా కంప్లీట్ చేయడానికి కాస్త ఎక్కువగా సమయమే తీసుకుంటాడు. అలాగే ఒక సినిమా కంప్లీట్ అయ్యాక మరో సినిమాను మొదలు పెడుతూ ఉంటాడు. కానీ వీరిద్దరూ ప్రస్తుతం మాత్రం తమ రూట్ను పూర్తిగా మార్చేశారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను మొదలు పెడుతున్నారు. అలాగే సినిమా షూటింగ్లను కూడా అత్యంత వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. చిరంజీవి కొంత కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా విడుదల తేదీ ఇంక ఖరారు కాలేదు. అందులోనే చిరంజీవి మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమాలో కంప్లీట్ చేస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒకే సారి హరిహర వీరమల్లు , ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో హరిహర వీరమల్లు , ఓజి సినిమాలను కంప్లీట్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ప్రస్తుతం పవన్ పాల్గొంటున్నాడు. ఇలా చిరు , పవన్ అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేయడానికి ప్రధాన కారణం ఆ మూవీ లో దర్శకులే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: