ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా గురించే మాట్లాడుతున్నారు జనాభా.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా కూడా మామూలుగా లేదు . థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్  ఫ్యాన్స్ సందడి జోరు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు . భారీ భారీ కటౌట్లతో భారీ భారీ ఫ్లెక్సీలతో పాలాభిషేకాలతో పెద్ద పెద్ద పూలదండలతో నానా హంగామా చేసేస్తున్నారు . తాజాగా అమరావతిలో జరిగిన హరిహర వీరమల్లు ప్రమోషన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు .

అంతేకాదు ఆయన చెప్పిన ఆన్సర్స్ కొన్ని నవ్వులు కూడా పూయించాయి . కాగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ ఇచ్చిన ఆన్సర్ మైండ్  బ్లోయింగ్ అనిపించింది . "ఈ సినిమాని మీరు సీఎం చంద్రబాబుకి చూపిస్తారా..?" అని విలేకరి ప్రశ్నించగా ..పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇస్తూ.."సీఎం రోజు నన్ను చూస్తున్నారుగా ఇంకా ప్రత్యేకంగా ఏముంది..? ఒకవేళ మూవీ చూసినా కూడా ఐదు నిమిషాలు చూస్తారేమో అంతే ప్రస్తుతం ఆయన చాలా చాలా బిజీగా ఉన్నారు. ఒకవేళ కూటమి ఎమ్మెల్యేలు కోరితే ఇంట్రెస్ట్ చూపితే స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం " అంటూ పవన్ కళ్యాణ్ చెప్పు వచ్చారు.

"అందరిలా సింపుల్ ప్రశ్నల కి ఆన్సర్ చేయకుండా చాలా చాలా సింపుల్ గా ఆన్సర్ చేసి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ " అంటూ ప్రూవ్ చేసుకున్నాడు పవర్ స్టార్ . సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మరికొద్ది గంటల్లోనే "హరి హర విరమల్లు" సినిమా రిలీజ్ కాబోతుంది . చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది . కాగా ఈ సినిమా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే టికెట్లు అన్నీ రిలీజ్ చేసిన అరగంటలోనే సోల్డ్ అవుట్ అని చూపిస్తున్నాయి . దాదాపు 5 ఏళ్లకు పైగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతుండడం సినిమా కి ఒక ప్లస్ పాయింట్ అయితే  ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు  చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్  నటించి రిలీజ్ అవుతున్న  సినిమా ఇదే కావడం ఇంకొక ప్లస్ పాయింట్.  కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బ్లాస్ట్ చేస్తుంది అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . అది కూడా మరి కొద్ది సేపట్లో తెలిసిపోతుంది. ఇవాళ రాత్రి 9: 30 నిమిషాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షో లు  పడబోతున్నాయి.  పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే..!!?


మరింత సమాచారం తెలుసుకోండి: