
ఖుషి సినిమాలో ఏవిధంగా అభిమానులని ఆకట్టుకున్నారో ఈ హరిహర వీరమల్లు సినిమాలో కూడా అంతే హై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ ప్రశంసిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 23న బుధవారం రాత్రి 9:30 గంతలకి ప్రీమియర్స్ పడ్డాయి . ఆ సమయం లో థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంకా కాదు . ఒక దగ్గరే ఈ విధంగా సందడి చేశాఏఅ అంటే కాదు.. మొత్తం సినిమా ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అన్ని థియేటర్స్ వద్ద హంగామా చేశారు .
అయితే అన్నిటికన్నా స్పెషల్ గా మారింది కడపలో ఫ్యాన్స్ చేసిన విన్నుత ర్యాలీ . ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా హరిహర వీరమల్లు విడుదల అవుతుంది అన్న ఆనందంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు . థియేటర్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు . అంతేకాదు భారీ సంఖ్యలో బాణాసంచా పేల్చి బైక్ ర్యాలీ నిర్వహించారు . బైక్ సౌండ్స్ తో హారన్ కొడుతూ అరుపులు కేకలతో సందడి చేశారు . కొంచెం సేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది . కాగా హరిహర వీరమల్లు సినిమా పాజిటివ్ టాక్ రావడం పట్ల సినీ ప్రముఖులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొక పక్క సినిమాకి టైం కేటాయించి సినిమా రిలీజ్ అయ్యేలా చేసి ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు పవన్ ..నిజంగానే గ్రేట్ హీరో అంటూ పొగిడేస్తున్నారు..!!