
ట్రైలర్ లో కియారా అద్వానీకి సైతం ఊహించని స్థాయిలో ప్రాధాన్యత దక్కడం గమనార్హం. వార్2 సినిమా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ పాత్రకు సంబంధించి ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది. ట్రైలర్ ఫస్ట్ టైం నచ్చకపోయినా చూసే కొద్దీ చూసే కొద్దీ ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ జనరేషన్ ప్రేక్షకులకు నచ్చేలా ట్రైలర్ ఉంది. హృతిక్ రోషన్ డబ్బింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ట్రైలర్ వేరే లెవెల్ లో ఉండేది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నప్పటికీ టీజర్ లో చుసిన షాట్స్ ను ఎక్కువగా రిపీట్ చేయడం గమనార్హం. సినిమాలో ఎమోషనల్ సీన్స్ కు సైతం ఎక్కువగానే ప్రాధాన్యత ఉండటం గమనార్హం.
ఏజెంట్ విక్రమ్ పాత్ర తారక్ కెరీర్ లో సంథింగ్ స్పెషల్ గా నిలవబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. వార్2 సినిమా రిలీజ్ కు సరిగ్గా మూడు వారల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. వార్2 సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేరాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.