
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాలతో నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి - ఏ. ఎం . జ్యోతి కృష్ణ కలిసి డైరెక్టు చేసిన ఈ సినిమా నాలుగేళ్లపాటు షూటింగ్ జరుపుకుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత ఏం రత్నం భారీ బడ్జెట్ తో వీర మల్లు సినిమాను నిర్మించారు. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు సినిమా తొలి రోజు రు . 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..
హరి హర వీరమల్లు సినిమా కు కేవలం ప్రీమియర్ షో లతోనే రు . 30 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. ఒక నైజాం ఏరియా లోనే మూడున్నర కోట్లు . . . తూర్పుగోదావరి లో కోటిన్నర ప్రీమియర్ షోలతో కొల్లగొట్టింది. దీంతో పాటు తొలి రోజు 40 కోట్లకు పైగా వసూళ్లకు వచ్చాయి. ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలె క్షన్లు కలిపి ఈ సినిమా రు. 70 కోట్ల కు పైగా వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గా ల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టి కి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరు కు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు