సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నారంటే వారందరూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే..సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ కూడా ఇంత పెద్ద హీరోయిన్లు అవ్వడానికి మా జీవితం సాఫీగా సాగింది అని చెప్పుకోరు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాకే ఇక్కడదాకా వచ్చామని చెప్పుకుంటూ ఉంటారు.అంతే కాదు కొంతమంది హీరోయిన్లు అయితే తాము సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దర్శక నిర్మాతలతో, హీరోలతో,క్యారెక్టర్ ఆర్టిస్టులతో, క్యాస్టింగ్ డైరెక్టర్లతో ఫేస్ చేసిన ఇబ్బందులను కూడా బయటపెడుతూ ఉంటారు.అలా ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న ఓ హీరోయిన్ గురించి మనం తెలుసుకుందాం.

 ఆ హీరోయిన్ ని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన అండర్ వేర్ చూడాలి అంటూ ఓ దర్శకుడు వేధించారట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే ప్రియాంక చోప్రా.. కోలీవుడ్,హాలీవుడ్, బాలీవుడ్,టాలీవుడ్ ఇలా ఎక్కడైనా సరే ప్రియాంక చోప్రా పేరు అందరికీ సుపరిచితమే.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అంటే ఆమెకు 19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఓ దర్శకుడు సినిమా ఆడిషన్ కోసం అని పిలిచారట.సినిమా అవకాశం వచ్చింది అని ఆనందపడి వెళ్లిన ప్రియాంక చోప్రాకి అక్కడికి వెళ్ళాక పెద్ద షాక్ తగిలిందట. అదేంటంటే  ప్రియాంక చోప్రా సెట్ కి వెళ్ళాక ఆమె పక్కనే డైరెక్టర్ నిలబడి  తన స్టైలిష్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా ఒక చిన్న ప్యాంటీస్ లో మాత్రమే ఈ సినిమాలో కనిపించాలి.

ఆమె వేసుకున్న ప్యాంటీ సినిమా థియేటర్లో చూసేటప్పుడు ముందు వరుసలో కూర్చున్న వాళ్లకు కూడా కనిపించాలి అంత చిన్నగా ఉండాలి. అలాగే నాక్కూడా ఆ చిన్న పాంటి కనిపించాలి అలా ఉండాలి ఆమె బట్టలు అంటూ పదేపదే ఆ పదాన్ని వాడుతూ అసభ్యంగా మాట్లాడారట. అయితే డైరెక్టర్ అలా అసభ్యంగా చిన్న అండర్వేర్ మాత్రమే ఒంటిమీద కనిపించాలి అని మాట్లాడేసరికి ప్రియాక చోప్రాకి అస్సలు నచ్చలేదట. దాంతో వెంటనే ఇంటికి వచ్చేసి తన తల్లికి ఈ విషయం చెప్పి బోరున ఏడ్చిందట. అంతే కాదు ఇలాంటి మాటలు మాట్లాడే వాడితో నేను ఎలా జర్నీ చేయగలను. నేను ఆ సినిమాలో నటించను అని ప్రియాంక చోప్రా ఆ సినిమాను వదిలేసుకుందట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ప్రియాంక చోప్రా ఆ దర్శకుడు ఎవరో పేరు మాత్రం బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: