సినిమా రిలీజుకు ముందుగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాలంటే ట్రైల‌ర్ ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకోవాలి. రిలీజ్‌కు ముందు వ‌ర‌కు ట్రైల‌ర్‌నే రిఫ‌రెన్స్‌గా తీసుకుంటారు. అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమాపై ఆసక్తి కలిగించేలా ట్రైలర్‌ను రూపొందిస్తారు. వార్ 2 సినిమాపై అంచ‌నాలు ఏ స్థాయిలో ఉండాలి. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌, మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా ట్రైలర్ జులై 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. ట్రైలర్ పూర్తిగా హై ఓక్టేన్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్‌తో కళ్లు కట్టిపడేస్తోంది. ఎన్టీఆర్ హైలైట్‌గా కనిపించగా, హృతిక్ రోషన్ స్టైలిష్ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. కియారా అద్వానీ గ్లామర్ తో పాటు కొన్ని రొమాంటిక్ మోమెంట్స్‌లో మెరిసింది.


ట్రైలర్‌లో చూపించిన ఎన్టీఆర్-హృతిక్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ట్రైల‌ర్ విడుదలైన 24 గంటల్లోనే 54.71 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ఇది సాధారణంగా మంచి ఫీట్ ... కానీ ఈ సినిమా ఇద్ద‌రు పెద్ద స్టార్స్ ఉన్న సినిమా కావడంతో ఈ వ్యూస్ అనుకున్నంత లేవ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌ల జాబితాలో వార్ 2 చోటు ద‌క్కించు కోలేకపోయింది. ఇప్పటికీ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ పార్ట్ 1 - సీజ్ ఫైర్ ట్రైలర్. ఈ ట్రైలర్ 24 గంటల్లో 113.2 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


ఇక 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 15 ట్రైలర్ల జాబితా ఇలా ఉంది:

సలార్ పార్ట్ 1 – 113.2 మిలియన్ వ్యూస్

ఆర్ఆర్ఆర్ (RRR) – 105.5 మిలియన్ వ్యూస్

అదిపురుష్ – 98 మిలియన్ వ్యూస్

పుష్ప: ది రైజ్ – 91.8 మిలియన్ వ్యూస్

జవాన్ – 87.6 మిలియన్ వ్యూస్

కేజీఎఫ్ ఛాప్టర్ 2 – 84.9 మిలియన్ వ్యూస్

లియో – 81.3 మిలియన్ వ్యూస్

విక్రమ్ – 76.2 మిలియన్ వ్యూస్

విక్రమ్ రొన – 71.4 మిలియన్ వ్యూస్

బ్రహ్మాస్త్ర – 68.7 మిలియన్ వ్యూస్

భీమ్‌లా నాయక్ – 66.5 మిలియన్ వ్యూస్

వాల్తేరు వీరయ్య – 63.1 మిలియన్ వ్యూస్

తునివు – 61 మిలియన్ వ్యూస్

సర్కార్ వారీ పాట – 59.4 మిలియన్ వ్యూస్

విక్రాంత్ రోనా – 55.8 మిలియన్ వ్యూస్

మరింత సమాచారం తెలుసుకోండి: