"రామ్ చరణ్".. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సూపర్ స్టార్ హీరో . చాలా సింపుల్ గా ఇండస్ట్రీలోకి "చిరుత" అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత తన పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు అనే విషయం అందరికీ తెలుసు . ఇప్పుడు రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో . టాప్ ఫైవ్ హీరోలల్లో కచ్చితంగా రామ్ చరణ్ పేరు ఉంటుంది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . ప్రజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోగానే రామ్ చరణ్ - సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఇలాంటి మూమెంట్లోనే  రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు .


రామ్ చరణ్ కి సాధారణంగా ట్యాటూ అంటే ఇష్టం ఉండదు . కానీ ఒక టాటూ మాత్రం చాలా ఇష్టంగా వేయించుకున్నాడట రామ్ చరణ్ . ఆ పేరు ఎవరిదో కాదు రామ్ చరణ్ సతీమణి "ఉపాసన".  ఉపాసన ని ముద్దుగా చరణ్ "ఉప్సి" అంటూ పిలుస్తాడు . రామ్ చరణ్ తన ఛాతిపై పచ్చబొట్టు వేయించుకున్నారట . ఇది చాలా తక్కువ మందికే తెలుసు అంటూ కూడా ఫ్రెండ్స్ బయటపెట్టారు . రామ్ చరణ్ కి ఉపాసన అంటే అంత ఇష్టం . రాంచరణ్ లో సగభాగం ఉపాసన అని అంతా మాట్లాడుకుంటారు . కానీ రామ్ చరణ్ అణువణువున ఉపాసననే ఉంది అనే విధంగా ఇలా "ఉప్సి" అంటూ పచ్చబొట్టు పొడిపించుకున్నారట.  ఇది ఎప్పుడు కూడా బయటకు ఎక్స్పోజ్ చేయడం ఎవరు చూడలేదు.  అసలు రామ్ చరణ్ కి ఆలా ఎక్స్ పోజ్ చేయడం ఇష్టం ఉండదట .



 తన లైఫ్ లో ఎంతో స్పెషల్ అయిన ఉపాసన పేరుని ఇలా పచ్చబొట్టుపొడిపించుకున్నాడు రామ్ చరణ్ అంటూ గతంలో చాలా వార్తలు వినిపించాయి. అయితే దీనిపై రామ్ చరణ్ కానీ మెగా ఫ్యామిలీ కానీ ఎప్పుడు స్పందించలేదు. మరొకసారి రామ్ చరణ్ అభిమానులు ఈ వార్తను వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసనకు "క్లింకారా" అనే పాప ఉంది . తనతో టైం స్పెండ్ చేస్తూనే ఇద్దరు కూడా తమ బిజీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: