ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ స్టార్ ఇమేజ్ కలిగిన హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. నటిగా కెరియర్ను మొదలు పెట్టిన చాలా తక్కువ కాలం లోనే ఈమె మంచి విజయాలను అందుకోవడంతో చాలా తక్కువ సమయం లోనే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నాక కూడా ఈమె ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా విజయాలను అందుకుంటు అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు కొనసాగించింది. ఒక నయనతార విషయంలో నెగిటివ్ అంశం కూడా ఉంది. అది ఏమిటి అంటే ... నయనతార ఈ సినిమాకు ఒప్పుకొని సినిమా పూర్తి చేశాక ఆ మూవీ ప్రమోషన్లలో అసలు పాల్గొనదు అని , దాని ద్వారా ఆ మూవీ నిర్మాతలకు కాస్త నష్టం జరిగే అవకాశం ఉంది అని ఓ కామెంట్ ఉంది.

ఇకపోతే ఈమె కూడా దాదాపు ఏ సినిమా చేసిన ఆ మూవీ ప్రమోషన్లకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ప్రస్తుతం రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఎప్పుడు సినిమా పూర్తి అయ్యాక కూడా ప్రమోషన్లలో పాల్గొని నయనతారమూవీ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్లు తెలియజేసే ప్రమోషన్ వీడియోలో పాల్గొంది.

దానితో అనిల్ రావిపూడి చాలా గ్రేట్ ... సినిమా ప్రమోషన్లను ఆయనను బీట్ చేసేవారు ఎవరూ లేరు ఎప్పుడు. సినిమా ప్రమోషన్లలో పాల్గొనని నయనతార తో కూడా మూవీ ప్రమోషన్ చేయించాడు. ఇతను ఎంతో గ్రేట్ అని అనిల్ పై ఎంతో మంది ప్రశంశాలు కురిపించారు. ఇకపోతే అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార కూడా ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రతి షెడ్యూల్ ను అనుకున్న దాని కంటే ముందే పూర్తి చేయడం , అలాగే నటీనటులతో ఎంతో జాలీగా ఆయన ఉంటుండడంతో అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార ఫిదా అయిపోయింది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: