
ఈ నేపథ్యంలో తాజా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే – "పెద్ది"లో ఓ స్పెషల్ ఫోక్ రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేశారట మేకర్స్. అదేంటంటే… పల్లెజనాల్లో చిరపరిచితమైన జానపద గీతం "మా ఊరి ప్రెసిడెంట్" పాటను కొత్త స్టైల్‌లో రీమిక్స్ చేసి తెరపై తెగ ఊపేయాలని రెడీ అవుతున్నారట. ఈ పాటను పెంచల్ దాస్ ఆలపించనున్నట్లు సమాచారం, అలాగే రెహమాన్ మ్యూజికల్ మాజిక్‌తో పాటకి కొత్త ఊపిరి పోసే పనిలో ఉన్నారు. ఇక ఈ స్పెషల్ పాటలో చరణ్‌తో కలసి డాన్సులు దుమ్ములేపనుంది టాలీవుడ్ నాటి కిస్సిక్ బ్యూటీ శ్రీలీల. ఇటీవల జూనియర్ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను అలరించిన శ్రీలీల.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో బిజీగా ఉంది.
కానీ "పెద్ది"లో చరణ్‌తో కలిసి వచ్చే ఈ పాటతో మళ్లీ తెలుగు అభిమానుల హృదయాలు కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది. "పుష్ప 2"లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో గుర్తుందిగా! అదే రేంజ్ కిక్కు ఈసారి కూడా మాస్ ఆడియన్స్‌కు రాబోతోంది. ఒకవైపు చరణ్ రగ్గడ్ లుక్ .. మరోవైపు శ్రీలీల గ్లామర్ ట్రీట్.. ఈ పాట థియేటర్లను షేక్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఇంత స్పెషల్ మాస్ హంగామా జరుగుతుంటే… "పెద్ది" సినిమా రొటీన్ మాస్ సినిమా కాదని, ఇది పాలిటిక్స్ + స్పోర్ట్స్ + పవర్ ప్యాక్ ఎమోషన్ మిక్స్ అయిన బ్లాక్‌బస్టర్ అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈసారి మెగా మాస్ పేలుడు గ్యారంటీ!