
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ శిఖరం. చిరు సినిమాలలో చంటబ్బాయ్ సినిమా ఒకటి. ప్రముఖ హాస్య దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమా, విభిన్నంగా కామెడీ ట్రాక్ మీద నడవడం విశేషం. చిరంజీవి - సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో, అప్పటివరకు మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరుకు ఇది ఒక వేరే కోణం చూపించే ప్రయత్నం. కథను విన్న చిరంజీవి మొదటగా ఆసక్తిగా స్పందింయకపోయినా దర్శకుడు సినిమాను పూర్తిగా కామెడీ ట్రాక్‌పై నడిపిస్తారని ఆయన ఊహించలేకపోయారు. కానీ సినిమా పూర్తయిన తర్వాత, అది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్‌గా మారింది. చిరు అభినయం, టైమింగ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాలో అసాధారణంగా నిలిచాయి. ప్రేక్షకులు నవ్వుల్లో మునిగి తేలారు.
సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చింది. అయితే, ఇది చిరు కెరీర్‌లో ఒక మలుపు అయ్యింది. ఎందుకంటే, ఈ సినిమా తర్వాత ఆయనకు వచ్చిన అవకాశాల్లో ఎక్కువ భాగం కామెడీ సెంటిమెంట్‌తో కూడిన చిత్రాలే. ఈ సినిమా తర్వాత వరుసగా కామెడీ కథాంశంతో ఉన్న సినిమాలే రావడంతో చిరు ఎంతో అసౌకర్యంగా ఫీలయ్యారట. ఈ విషయాన్ని చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చంటబ్బాయ్ విజయంతో వచ్చిన కొత్త తరహా సినిమాలను చిరంజీవి తిరస్కరించలేక కాస్త ఇబ్బందిపడ్డారని చెప్పారు. ముఖ్యంగా అభిమానుల అంచనాలను మళ్ళీ పూరించేందుకు, తాను మాస్ హీరో అనే గుర్తింపును తిరిగి పొందేందుకు చిరంజీవి చాలా కృషి చేశారట.
సుమారు ఆరు నెలల పాటు మంచి కథ కోసం చిరంజీవి ఎదురుచూశారనీ, తదుపరి చిత్రం ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారనీ అరవింద్ చెప్పారు. అయినా కూడా, చిరంజీవి చంటబ్బాయ్ గురించి ఎప్పుడూ అసంతృప్తిగా మాట్లాడలేదట. దాన్ని ఒక ప్రయోగంగా తీసుకుని, జంధ్యాల వంటి గొప్ప దర్శకుడితో పని చేయడం తనకు మంచి అనుభవమని భావించారట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు