ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు పొందిన హీరో..పుష్ప సినిమా ద్వారా ఈయన  అద్భుతమైనటువంటి పేరు సంపాదించారు. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పుష్ప పుష్పరాజ్ అనే డైలాగులు పేలిపోయాయి. అలాంటి అల్లు అర్జున్ సినిమాలు తన కుటుంబం తప్ప మరో విషయాల్లో వేలు పెట్టరు. అయితే ఆయన  ఇంతటి స్థాయికి చేరడానికి తన జీవితాన్ని మార్చినటువంటి ఒక  పుస్తకం గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జీవితాన్ని మార్చింది ఒక పుస్తకం అని ఆయన తెలియజేశారు. జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం సందర్భంగా, రిక్ రూబీన్ రాసిన ది క్రియేటివ్ యాక్ట్  ఏ వే ఆఫ్ బీయింగ్  అనే పుస్తకం తనకెంతో ఇష్టమని, సృజనాత్మక రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిందే అని తెలియజేశారు. 

ఈ పుస్తకం చదవడం వల్ల తన ఆలోచన విధానం పూర్తిగా మారిందని, దీన్ని రాసిన శరత్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..ఆగస్టు 9న  జాతీయ పుస్తక ప్రియుల దినోత్సవం సందర్భంగా బన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ సందర్భంగా బన్నీ ఇలా రాసుకోచ్చారు.. నా ఆల్ టైం ఫేవరెట్ పుస్తకాల్లో ఒక దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.. రిక్ రూబీన్ రాసిన ది క్రియేటివ్ యాక్ట్ ఏ వే ఆఫ్ బీయింగ్  అనే బుక్ నాకు అత్యంత ఇష్టమని తెలియజేశారు.

ఈ పుస్తకాన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చాయ్ బిస్కెట్ శరత్ చంద్రకి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను  అంటూ బన్నీ రాసుకొచ్చారు. అయితే ఇందులో ఈ పుస్తకం యొక్క కవర్ పేజీని ఫోటో తీసి ఇన్స్టాల్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ పుస్తకం పేరు కూడా అందరికీ తెలిసిపోయింది. అల్లు అర్జున్ అభిమానులు, ప్రముఖులు ఈ పుస్తకాన్ని మేము కూడా చదువుతామని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: