
మొదటి నుంచే ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. రజనీకాంత్ పర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్ అవుతుందని, నాగార్జున నెగిటివ్ రోల్ సినిమా కధని మలుపు తిప్పుతుందని ముందుగానే ప్రిడిక్ట్ చేశారు. అయితే, సినిమా రిలీజ్ అయిన తర్వాత రజనీకాంత్, నాగార్జున, శృతిహాసన్ పేర్ల కంటే కూడా లోకేష్ కనగరాజ్ పేరు హైలైట్ అయ్యింది. ప్రతి రివ్యూలోనూ — రజనీకాంత్ పర్ఫార్మెన్స్ ఓకే కానీ, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ మాత్రం పీక్స్‌లో ఉందని చెబుతున్నారు. కొన్ని కొన్ని సీన్‌లో రజనీకాంత్‌ని చూపించిన విధానం గూస్‌బంప్స్ తెప్పిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సినిమా ఇంత బిగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడానికి రజనీకాంత్ పర్ఫార్మెన్స్ ఒక కారణమైతే, అంతకంటే పెద్ద కారణం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ అని అంటున్నారు. కొన్నిసార్లు డైరెక్షన్‌తో కూడా భారీ హిట్ కొట్టొచ్చని లోకేష్ కనగరాజ్ ప్రూవ్ చేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. కొంతమంది అయితే ..“ఈ సినిమా హిట్ అవ్వడానికి కర్త, కర్మ, క్రియ అంతా లోకేష్ కనగరాజ్” అంటూ తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. మొత్తానికి, బాక్స్ ఆఫీస్ వద్ద ‘కూలీ’ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..???