
ఈ క్రమంలోనే కూలీ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక సందర్భంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పే సీన్ ఉంది. ఆ టైంలో థియేటర్స్‌లో అభిమానులు అరుపులు, కేకలతో రచ్చ రంబోలా చేసేశారు. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. దానికి సంబంధించిన పిక్చర్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూలీ సినిమా టాక్ మొత్తం ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్–చిరంజీవి పేర్లు చెప్పిన సీన్‌ను హైలైట్ చేస్తున్నారు జనాలు. ముఖ్యంగా మెగా అభిమానులు ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు.
కూలీ సినిమాను లోకేష్ కనగరాజ్ తనదైన స్టైల్‌లో డైరెక్ట్ చేశారు. అయితే "విక్రమ్" సినిమాకి ఆయన కష్టపడిన్నంతగా.. చూపించినంత ఇంట్రెస్ట్ ఈ సినిమాకి చూపించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని లోపాలు ఆయన డైరెక్షన్‌లో ఉన్నాయని సినీ ప్రముఖులు అంటున్నారు. కానీ రజనీకాంత్ ఫ్యాన్స్ కి మాత్రం అవి పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాని ధియేటర్స్ లో బాగా ఎంజయ చేస్తున్నారు..!