
ముఖ్యంగా, వార్ 2 సినిమాను కచ్చితంగా థియేటర్‌లోనే చూడాలని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. “ఆ ఒక్క సీన్ కోసం అయినా సినిమా చూడాలి” అని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జి దైరెక్ట్ చేశారు. సినిమాలోని యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ట్రైన్ ఫైట్ సీన్.. ఎన్టీఆర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హైలైట్‌గా మారింది. క్లైమాక్స్‌లో హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఫైట్స్ మాత్రం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను థియేటర్‌లో తప్పక చూడాలని సూచిస్తున్నారు.
నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ చాలా విభిన్నంగా ఉందని, ఇలాంటి సీన్‌లో ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఆ సీన్ చూస్తేసే ప్రతి ఎన్టీఆర్ అభిమానికి గూస్‌బంప్స్ ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తారక్ కి మంచి హిట్ నే పడ్డింది. చూడాలి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో...???