సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఒక ఫేవరెట్ సినిమా ఉంటుంది. అది అభిమానులకైనా, స్టార్స్‌కైనా, ఆ సినిమాలో నటించిన హీరో–హీరోయిన్లకైనా కావచ్చు. ఎన్ని సినిమాలు చేసినా, ఒక సినిమా మాత్రం పదేపదే చూడాలని అనిపిస్తుంది. ఆ సినిమా వాళ్లలో కడుపు నిండా ఫీలింగ్ కలిగిస్తుంది. చాలామంది ఆ విషయాలను పలు ఇంటర్వ్యూల్లో ఓపెన్‌గా బయటపెడతారు. కొంతమంది ఒక సినిమాని పొగడితే, మరొక సినిమా స్టార్స్ బాధ పడ్డతారేమోనన్న భయంతో సైలెంట్‌గా ఉంటారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం అలా కాదు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో.  ఎలాంటి ఇంటర్వ్యూకి హాజరైనా, అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లు సమాధానమిస్తారు. అదే కారణంగా రవితేజను జనాలు ఇంకా ఎక్కువగా లైక్ చేస్తారు.


ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, “ఎదైనా మీరు నటించిన సినిమాకి  సీక్వెల్‌గా తీసుకురావాలనుకుంటే ఏది చేస్తారు ?” అని అడగగా, అక్కడ ఉన్నవాళ్లు విక్రమార్కుడు, ఇడియట్ అంటూ రకరకాల పేర్లు చెప్పారు. కానీ రవితేజ మాత్రం స్ట్రైట్‌గా క్రాక్ 2 అని చెప్పారు. “క్రాక్ సినిమా నా జీవితంలో చాలా ప్రత్యేకం. ఛాన్స్ వస్తే ఆ సినిమాకి సీక్వెల్ తీస్తాను” అంటూ ప్రకటించారు. ఆయన సమాధానం విన్న వెంటనే అక్కడ ఉన్న అభిమానులు అరుపులు, కేకలతో రచ్చ చేశారు. చాలా రోజులుగా గోపీచంద్ మలినేని–రవితేజ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. బహుశా అది నిజమై, క్రాక్ 2 రూపంలో రాబోతుందేమో అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.



క్రాక్ సినిమా రవితేజ అభిమానులకు బాగా నచ్చింది. ఆ సినిమాలో శ్రుతి హాసన్ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకోగా, ‘జయమ్మ’ పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఘాటు నటనతో చింపేసింది అని చెప్పాలి. ఈ కాంబో మరోసారి రిపీట్ అయితే మాత్రం కెవ్వు కేకే, నో డౌట్. అలా తన జీవితంలో క్రాక్ సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉందని, అది తన ఫేవరెట్ మూవీ అని రవితేజ బహిరంగంగానే ప్రకటించారు. ఇదే న్యూస్ పూడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: