
తర్వాతి రౌండ్‌లో మిగిలిన 16 మందికి "డేర్ ఆర్ డై" అంటూ మూడు లెవెల్స్ టాస్కులు ఇచ్చారు. ఫిజికల్, మెంటల్ స్ట్రాంగ్ టాస్కులతో వారిని బిగ్ బాస్ స్టైల్లోనే పరీక్షించారు. రెండో ఎపిసోడ్‌లో హరీష్, శ్రీజ, ప్రియా, కల్కి, కళ్యాణ్ ఫుల్ జోష్ చూపించి టాప్ 15లో తమ స్థానం సంపాదించుకున్నారు. తుది రౌండ్ అంటే లెవెల్ 3లో అసలు టెన్షన్ పెరిగింది. ఆఖరి 11 మందిలోంచి ఎవరు ఫైనల్ లిస్ట్‌లోకి వెళ్తారన్న సస్పెన్స్ నిన్నటివరకు కొనసాగింది. చివరికి నాగ, డాలియా, షాకీబ్, మనీష్ పర్ఫార్మెన్స్‌తో దూసుకెళ్లి గోల్డెన్ చెయిర్ మీద కూర్చున్నారు. అలా టాప్ 15 మెంబర్స్‌కి "బిగ్ బాస్ హౌస్ గేట్" తెరుచుకుంది.
ఇక అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఈ 15 మందిలో కేవలం 9 మందికే హౌస్‌లోకి ఎంట్రీ దొరుకుతుంది. సెలబ్రిటీస్‌తో ఈసారి ఈ కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే "అగ్నిపరీక్ష" టాస్కుల ద్వారా వీళ్ళకు ఓట్ బ్యాంక్ రెడీ అయ్యింది. అందుకే ఎంట్రీ కాగానే సెలబ్రిటీస్‌కు టఫ్ పోటీ ఖాయం అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. సెప్టెంబర్ 7 నుంచి మొదలవుతున్న బిగ్ బాస్ సీజన్ 9లో "సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్" అనే థీమ్‌కి ప్రేక్షకులు మాస్‌గా కనెక్ట్ అవ్వబోతున్నారు. "ఇది కేవలం రియాలిటీ షో కాదు.. ప్రజల కలలు నిజమయ్యే వేదిక" అని కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ జోష్ చూపిస్తున్నారు. అసలు ఎవరు హౌస్‌లో దుమ్మురేపుతారో.. ఎవరు ఫ్యాన్స్ హార్ట్ దోచుకుంటారో చూడాలి.