- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన కింగ్‌డమ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్‌లలో విడుదలైన తర్వాత ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నిరాశపరిచింది. నిర్మాత నాగవంశీకి కూడా నష్టాలు మిగిలాయి. బయ్యర్ల పరిస్థితి కూడా అలాగే మారింది. ఇక థియేటర్‌లో చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూశారు. అయితే అక్కడ కూడా వారు నిరాశ చెందాల్సి వచ్చింది. థియేటర్ వెర్షన్‌లో లేని “హృదయం లోపల” అనే మెలోడీ సాంగ్‌ను ఓటీటీ వెర్షన్‌లో అయినా చూడొచ్చని అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎక్కువ ఆసక్తి చూపించారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన వెర్షన్‌లో కూడా ఆ పాటను ఎడిట్ చేసినట్టే ఉంచేశారు. దీంతో అభిమానులకు మ‌ళ్లీ నిరాశ త‌ప్ప‌లేదు.


నిర్మాత నాగవంశీ ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. కథ ఫ్లోకి అడ్డొచ్చిందనే కారణంతో ఆ పాటను తొలగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తనకూ ఆ పాట అంటే ఇష్టమే అయినా, కథా అవసరం దృష్ట్యా ఎడిట్ చేయడం తప్పలేదని చెప్పారు. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల చాలా సినిమాలు ఓటీటీలో థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే ఎక్కువ సన్నివేశాలు, పాటలతో వస్తున్నాయి.


ఉదాహరణకు యానిమల్, పుష్ప సినిమాల్లో థియేటర్‌లో లేని కొన్ని సీన్లు ఓటీటీలో చూపించారు. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందుకే కింగ్‌డమ్ కూడా అలాంటి స్పెషల్ కట్ వస్తుందేమో అనుకున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ థియేట్రికల్ కట్‌కే కట్టుబడి పోయింది. పాట ఉన్నా లేకపోయినా సినిమాకి వ్యూయర్‌షిప్‌లో పెద్దగా తేడా ఉండదనే లెక్కలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కానీ భాగ్యశ్రీ అభిమానులకు మాత్రం ఇది నిరాశగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: