
నాగ్ కెరీర్‌లో అన్నమయ్య మైలురాయిగా నిలిచింది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు సాధించింది. తర్వాత శ్రీరామదాసు, శిరిడిసాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలతో భక్తిరసాన్ని ఆవిష్కరించారు. అదే సమయంలో మన్మథుడు, నిన్నే పెల్లాదుతా, హలో బ్రదర్ వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్లతో యువతరానికి ప్రియమైన హీరోగా నిలిచారు. ప్రయోగాల విషయంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున, 40 మందికి పైగా కొత్త దర్శకులను, టెక్నీషియన్లను పరిచయం చేశారు. సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్ వంటి షోలతో సక్సెస్ అయ్యారు. ఇటీవల రజనీకాంత్ కూలీ సినిమాలో విలన్‌గా నటించి తన ఇమేజ్‌ను పక్కనబెట్టి కొత్త కోణం చూపించారు. ప్రస్తుతం 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఆయన, తన 100వ సినిమా కోసం రెడీగా ఉన్నారు.
సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ నాగ్ దూసుకెళ్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్, ఎన్ కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్స్‌తో పాటు స్పోర్ట్స్ జట్లలో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు. బ్రాండ్ అంబాసడర్‌గా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అంచనాల ప్రకారం నాగార్జున ఆస్తుల విలువ రూ.3700 కోట్లకు పైగా ఉంటుంది.70కి చేరువ అవుతున్నా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా నాగ్ తన గ్లామర్, స్టైల్‌తో ముందుకు సాగుతున్నారు. నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, టీవీ హోస్ట్‌గా బహుముఖ ప్రతిభ కనబరుస్తూ టాలీవుడ్‌లో ఎప్పటికీ “కింగ్”గానే నిలిచిపోతారని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. titles