
ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర సంగతులు బయటపెట్టింది. సాధారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి తర్వాత ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలనుకుంటున్నారు. అంతకుమించి కానేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. కానీ జాన్వీ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈ బ్యూటీ పెళ్లికి ముందే పిల్లల గురించి ప్లానింగ్ చేసేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు కావాలంటుంది.
పరమ సుందరి ప్రమోషన్ ఇంటర్వ్యూలో జాన్వీ పిల్లల గురించి మాట్లాడుతూ.. `నేను వివాహం తర్వాత ముగ్గురు పిల్లలను కనాలని అనుకుంటున్నాను. మూడు నా లక్కీ నెంబర్. అంతే కాదు నా పిల్లల్లో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ వాళ్ళలో ఒకరికి సపోర్ట్ గా ఉంటారు. సందర్భాలు బట్టి ఆ మద్దతు మారుతూ ఉంటుంది. తద్వారా నా బిడ్డలకు మంచి తోడు, మద్దతు దొరుకుతుంది` అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, జాన్వీ కపూర్ గత కొన్నేళ్ల నుంచి శిఖర్ పహారియాతో రిలేషన్‌లో ఉంది. వీరి వివాహానికి ఇరుకుటుంబ సభ్యుల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది.