ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఉండదు సినిమా నచ్చితే కోట్లు కురిపిస్తారు అన్నవిషయం లేటెస్ట్ గా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ మూవీ మరొకసారి ఇండస్ట్రీకి పాఠాలు నేర్పుతోంది. భారీ బడ్జెట్ తో అనుష్క ను నమ్ముకుని క్రిష్ తీసిన ‘ఘాటీ’ కలక్షన్స్ విషయంలో ఎదురీదుతూ ఉంటే చిన్న బడ్జెట్ తో తీసిన ‘లిటిల్ హార్ట్స్’ సూపర్ సక్సస్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  


‘లిటిల్ హార్ట్స్’ మూవీ మొదటిరోజు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్లు కలక్షన్స్ వసూలు చేసి ఈ వీకెండ్ శని ఆది వారాలలో ఎవరు ఊహించని కలక్షన్స్ తెచ్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈసినిమాకు సంబంధించిన టికెట్ల డిమాండ్ పెరిగిపోవడంతో ధియేటర్లు ఈసినిమా కోసం అదనపు షోలు వేస్తున్నాయి. సోషల్ మీడియా సెలబ్రిటీ మౌళిని హీరోగా పెట్టి తీసిన ఈ చిన్న సినిమా ఇంత సెన్సేషన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.


ఎంటర్ టైన్మెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సగటు ప్రేక్షకులు ఈసినిమా కోసం క్యూ కడుతున్నారు. ఎలాంటి అసభ్యత లేకుండా దర్శకుడు సాయి మార్తాండ్ తీసిన విధానం అందరికీ బాగా నచ్చింది.  ఒక మీడియం రేంజ్ హీరో సినిమాలకు రాని కలక్షన్స్ ఈసినిమాకు వస్స్తూ ఉండటంతో రానున్న రోజులలో మీడియం రేంజ్ ల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న చాలమందిలో ఏర్పడుతోంది.


బుక్ మై షోలో గంటకు 7 వేలకు పైగా టికెట్లు పైగా అమ్మకం జరుగుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ‘ఘాటీ’ తో పాటు అంచనాలతో విడుదలైన మురగదాస్ ‘మదరాసి’ మూవీ కూడ ఫెయిల్ అవ్వడంతో పాటు బాలీవుడ్ క్రేజీ మూవీ ‘బాఘీ 4’ కూడ ఫెయిల్ అవ్వడంతో ‘లిటిల్ హార్ట్స్’ కు ఎదురు లేకుండా పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి ఈ వీకెండ్ ముగిసిన తరువాత కూడ కొనసాగుతుంద లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: