తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ పెద్దగా ప్రచార చిత్రాలను విడుదల చేయకపోయినా ఈ మూవీ పై అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ఏవి విడుదల కాకపోయినా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ నెట్ వర్క్ సంస్థ వారు అత్యంత భారీ తరపు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయిన కొన్ని వారాల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యాక ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు , ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో కొన్ని వారాల రన్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా జీ నెట్ వర్క్ ఛానల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే తలపతి విజయ్ ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. కొంత కాలం క్రితం జన నాయగన్ సినిమానే నా చివరి సినిమా అని విజయ్ ప్రకటించాడు. దానితో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు విజయ్ అభిమానులతో పాటు మామూలు తమిళ సినీ ప్రేమికుల్లో కూడా ఏర్పడ్డాయి. మరి విజయ్ "జన నాయగన్" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: