బాలీవుడ్ లో ఉండే చాలామంది నటీనటులు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడంతో పాటు షూటింగ్ సెట్ లోకి వస్తే సకల మర్యాదలు చేయాలని వాళ్లతో వచ్చే పని వాళ్లకు కూడా సినిమా నిర్మాతలే పేమెంట్ చేయాలి అనే కండిషన్లు పెడతారు. ఇక ఆ సెలబ్రెటీలు పెట్టే కండిషన్లకు చాలామంది నిర్మాతలు భయపడిపోతుంటారు. అయితే ఈ మధ్యనే సందీప్ రెడ్డి వంగా దీపికా పదుకొనే పెట్టిన కండిషన్లకు ఒప్పుకోకుండా ఆమెను అందులో నుండి తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారు. అలా సందీప్ రెడ్డి వంగా పెట్టిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు దీపికాపై కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా ఓ బాలీవుడ్ జంటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆయన మాట్లాడుతూ.. ఓ బాలీవుడ్ హీరో సౌత్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.ఇక ఆ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ కి వెళ్లగా నిర్మాత ఉదయం వెళ్లి చూడగా అక్కడికి ఆరు వ్యానిటీ వ్యాన్లు ఉన్నాయి. ఇదేంటి ఒకేసారి ఇన్ని వ్యానిటీ వాన్లు ఉన్నాయి అని షాక్ అయి నేను ఆరుగురు హీరోలను పెట్టుకోలేదు కదా.. కేవలం ఒక హీరోనే పెట్టుకున్నాను. ఈ ఆరు వ్యానిటీ వ్యాన్లు ఏంటి అనుకున్నాడు. కానీ ఆ ఆరు వ్యానిటీ వ్యాన్లు కూడా ఒకే హీరోకి చెందినవి.ఆ హీరో రాత్రికి రాత్రే బాంబే నుండి తనకోసం ఈ వ్యాన్లు తెప్పించుకున్నాడు. దాంతో అసలు విషయం తెలిసి నిర్మాత షాకయ్యి ఇక ఈ హీరోతో పెట్టుకుంటే నా ఇల్లు అమ్ముకోవాల్సిందే అనుకున్నాడో ఏమో కానీ వెంటనే ఆ హీరోని లొకేషన్ లో చిన్న ప్రాబ్లం ఉంది ప్రాబ్లం క్లియర్ అయ్యాక మీకు మళ్ళీ చెప్తాను వెళ్లిపోండి అని చెప్పారు.

 దాంతో హీరో వెళ్లిపోయాడు.అయితే ఆ నిర్మాత అలా చెప్పడానికి కారణం ఒక్క రోజుకే ఈ హీరో కోసం 18 లక్షల ఖర్చు పెడితే నా బతుకు బస్టాండ్ అనుకున్నారు.అందుకే ఆ హీరో ని పక్కన పెట్టారు. అయితే బాలీవుడ్ లో ఉండే అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ లు మినహా కొంత మంది హీరోలు ఇప్పుడు నేను చెప్పినట్లే ఉంటారు. ఎందుకంటే వాళ్లు పర్సనల్ స్పేస్ కోసం ఒక వ్యానిటీ వ్యాన్,జిమ్, కిచెన్, మేకప్ ఇలా ప్రతి ఒక్క దానికి స్పెషల్ గా వానిటీ వ్యాను తెప్పించుకుంటారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ జంటతో సినిమా చేయాలంటే ఏకంగా 11 వ్యానిటీ వ్యాన్లు ఉండాల్సిందే. వాళ్ళు ప్రతి ఒక్క దానికి స్పెషల్ గా వ్యానిటీ  వ్యాన్ ని కోరుకుంటారు. అంతేకాదు ఓ వ్యానిటీ వ్యాన్ ని తమ పర్సనల్ స్పేస్ కోసం వాడుకొని బట్టలిప్పి పడుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చెసారు.

 అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం మెన్షన్ చేయలేదు. అయితే డైరెక్టర్ సంజయ్ గుప్తా మాటల్ని బట్టి చూస్తే ఆ మధ్యకాలంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బ్రహ్మ రాక్షస్ అనే సినిమా కోసం బాలీవుడ్ నటుడు రన్వీర్ సింగ్ ని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ సినిమా అటకెక్కినట్టు వార్తలు వినిపించాయి. ఇక సంజయ్ గుప్తా చెబుతున్న మాటలు రన్వీర్ సింగ్ ని ఉద్దేశించే అని కొంతమంది అనుమాన పడుతున్నారు.అంతేకాదు రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా కూడా దీపికపై ఇలాంటి కామెంట్లు చేయడంతో బాలీవుడ్లో ఉన్న ఆ జంట రన్వీర్ దీపిక పదుకొనేలే అంటూ డైరెక్టర్ సంజయ్ గుప్తా చేసిన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: