పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఓజి మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను 2 గంటల 30 నిమిషాలకు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్టార్ హీరోల సినిమాలకు 2 గంటల 30 నిమిషాలు అనేది పెద్ద రన్ టైమ్ ఏమీ కాదు.

ఇక ఈ సినిమాకు 2 గంటల 30 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు అనే వార్తలు బయటకు వస్తూ ఉండడంతో చాలా మంది పవన్ అభిమానులు సినిమా చాలా స్పీడ్ గా ఉండి ఉంటుంది. ఎక్కడ ఏ మాత్రం ల్యాగ్ ఉండి ఉండదు. అందుకే ఈ సినిమా రన్ టైమ్ ను 2 గంటల 30 నిమిషాలుగా వచ్చినట్లు ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతుండగా ... అర్జున్ దాస్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి వి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: