
సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ యష్మి.. తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఆయన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మేనేజర్‌ని, సోషల్ మీడియాలోనూ పొగడ్తలు కురిపిస్తున్నారు. “ఇదే పవన్ ఇమేజ్ కి తగ్గ సినిమా. ఇలాంటి ప్రాజెక్ట్ ఆయన చాలా కాలం క్రితమే చేయాల్సింది” అని ఫ్యాన్స్ మాత్రమే కాదు, నాన్- పవన్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అసలు ఈ కథను సుజిత్ మొదట పవన్ కళ్యాణ్ కోసం రాయలేదట. మొదట ఈ స్క్రిప్ట్‌ని మెగా హీరో వరుణ్ తేజ్ కి వినిపించారట. కానీ కొన్ని కారణాల వల్ల వరుణ్ తేజ్ ఈ సినిమాను చేయలేకపోయారు. ఆ తర్వాత ఈ కథను రానా దగ్గుబాటికి కూడా నేరేట్ చేశారట. అయితే రానా కూడా ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేసేశారట. అక్కడితో ఆగకుండా సుజిత్ ఈ కథను నాచురల్ స్టార్ నానికి కూడా వినిపించారన్న టాక్ ఫిలిం నగరంలో బాగా వినిపిస్తోంది. కానీ ఎవరో ఒకరి దగ్గర ఆగిపోవాల్సిన ఈ కథ చివరికి పవన్ కళ్యాణ్ వరకు చేరింది. ఇక మిగతా కథ మనకు తెలుసు – పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను తన భుజస్కంధాల మీద ఎక్కించుకుని, కొత్త హైట్‌లోకి తీసుకెళ్ళారు. నిజంగా చూస్తే దేవుడు ఎప్పుడు ఎలా ఏం జరగాలో ముందుగానే రాసి పెట్టేస్తాడు అంటారు. అది ఈ ప్రాజెక్ట్ విషయంలో మరీ నిజం అయింది.
ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరొక కల్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, అభిమానులకు కూడా ఎనలేని సంతోషం ఇచ్చింది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే – “ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో మరో పదేళ్లు హ్యాపీనెస్‌ని ఈజీగా ఎంజాయ్ చేసేస్తాం” అంటున్నారు. ఇక చూడాలి మరి, ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో..??