ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఒకటిగా పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నిలిచింది. మాస్ మసాలా ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన పూరి, తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తాడు. ఇక సౌత్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ కాంబినేషన్‌లో నటించడం నిజంగానే క్రేజీగా మారింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు స్టార్టింగ్ నుంచే భారీగా ఉన్నాయి. ఈ సినిమా కథ, నేపథ్యం, టైటిల్ విషయాలు ఇంతవరకు పూర్తిగా సస్పెన్స్‌లో ఉంచారు. కానీ అభిమానులు ఎదురు చూస్తున్న టైం వ‌చ్చేసింది. మేకర్స్ తాజాగా క్లారిటీ ఇస్తూ, సెప్టెంబర్ 28న ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆ రోజు కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర లో కనిపించనున్నారు. పూరి సినిమాల్లో పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి టబు పాత్ర కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది.  ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మంచి క్రేజ్ సాధించగా, ఈసారి విజయ్ సేతుపతి అడ్డాగా రావడంతో ప్రాజెక్ట్ రేంజ్ మరింత పెరిగింది. షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. త్వరలోనే పూర్తి చేసుకుని, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూరివిజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 28న రానున్న అప్డేట్‌తో ఈ ప్రాజెక్ట్‌పై మరింత బజ్ క్రియేట్ అవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: