కన్నడ ఇండస్ట్రీ లో నటుడిగా , దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రిషబ్ శెట్టి ఒకరు. ఈయన కొంత కాలం క్రితం కాంతారా అనే సినిమాలో హీరో గా నటించి , ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ద్వారా రిషబ్ శెట్టి కి అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా వచ్చింది. ఇకపోతే రిషబ్ శెట్టి తాజాగా కాంతారా చాప్టర్ 1 అనే టైటిల్ తో రూపొందిన సినిమాలో హీరో గా నటించాడు. అలాగే ఆ మూవీ కి రిషబ్ శెట్టి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ ని అక్టోబర్ 2 వ తేదీన చాలా భాషలలో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ మూవీ ని హిందీ లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. మరి నాలుగు రోజుల్లో హిందీ ఏరియాలో కాంతారా చాప్టర్ 1 మూవీ కి వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ కి హిందీ ఏరియాలో 18.50 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 13.5 కోట్లు , మూడవ రోజు 20 కోట్లు , నాలుగవ రోజు 23 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో కలిపి ఈ మూవీ కి హిందీ లో 75 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా నాలుగు రోజుల్లో ఈ సినిమా హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ లో రిషబ్ శెట్టి కి జోడిగా రుక్మిణి వసంత్ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: