ఇండస్ట్రీలో హీరోయిన్ల పోటీ ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం . ఒకరిపై ఒకరు పోటీ పడుతూ క్రేజ్ సంపాదించుకోవడంలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదు ముద్దుగుమ్మలు . ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు శ్రీ లీలా మరియు భాగ్యశ్రీ . వీరిద్దరూ తమదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు . శ్రీ లీలా తెలుగు మరియు హిందీ ఇండస్ట్రీలో రాణిస్తుంటే భాగ్యశ్రీ మాత్రం టాలీవుడ్ పైనే ప్రత్యేక దృష్టిని పెట్టింది . ఇక ఇప్పుడు ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే ప్రాజెక్ట్ కోసం రేసులో ఉన్నారన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు .


టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కొత్త సినిమా కోసం ఆసక్తికరమైన టైటిల్ను ఫిలిం ఛాంబర్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తుంది . క్లాసిక్ హిట్ ఏప్రియల్ 1 విడుదల లోని సూపర్ హిట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా.. అందరికీ గుర్తుండే ఉంటుంది . ఇక ఇప్పుడు ఈ పాట మొదటి లైన్ టైటిల్ గా రిజిస్టర్ చేయించారని వర్గాల్లో టాక్ . ఈ టైటిల్ తో రూపొందిబోయే మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని దర్శకుడు కూడా రెడీగా ఉన్నారని సమాచారం . మరీ ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టెడ్ గా రూపొందిన ఉందట .


ఇందులో హీరోయిన్ పాత్రకు భారీ స్కోప్ ఉండబోతుందని తెలుస్తుంది . దీంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశం ప్రెసెంట్ చాలా ఆసక్తికరంగా మారింది . ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కీలక పాత్ర కోసం శ్రీ లీలా పేరు బలంగా వినిపిస్తుండగా మరోవైపు భాగ్యశ్రీ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది . టాలీవుడ్ లో శ్రీ లీలాకు ఉన్న క్రేజ్ యూత్ రో భాగ్యశ్రీ గ్లామర్ ఫాలోయింగ్ మనందరికీ తెలిసిందే . ఈ ఇద్దరినీ సమాన స్థాయిలో రేసులో నిలిపాయి . ఇక నిర్మాతల ఫైనల్ డెసిషన్ కోసం అందరూ వేచి చూస్తున్నారు . చివరికి ఈ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే క్రేజీ టైటిల్ మూవీ కి లక్కీ హీరోయిన్ ఎవరో త్వరలోనే క్లారిటీ రానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: