టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కె-ర్యాంప్’ దీపావళి కానుకగా విడుదల కానుంది. జెయిన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా కిరణ్‌ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక ఈవెంట్‌లో ఓ అభిమాని, “ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసారా ? ” అని ప్రశ్నించాడు. దీనికి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ, “ ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడదలచుకోలేదు. ఒక లాజిక్‌ చెబుతాను. నేను పవన్ కళ్యాణ్ గారికి నిజమైన అభిమానిని. కానీ ఆయన గురించి తరచూ మాట్లాడితే అది ఇతరులకు రాంగ్‌గా క‌మ్యూనికేట్ కావొచ్చు,” అని చెప్పారు.


అలాగే తన సినిమా రిలీజ్‌కి దగ్గరగా వస్తుండటంతో పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నాడేమో అని అనుకోవచ్చు. లేదా ప‌వ‌న్‌ గురించి మాట్లాడితే టికెట్లు ఎక్కువ అమ్ముడవుతాయని భావిస్తున్నాడేమో అని కూడా భావించొచ్చు. నాకు ఆ విధమైన పబ్లిసిటీ వద్దు. నా సొంత గుర్తింపును నేను కష్టపడి సంపాదించాలనుకుంటున్నాను అని తెలిపారు. కిరణ్‌ అబ్బవరం ఈ వ్యాఖ్యలు చెప్పిన వెంటనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నిష్పక్షపాత దృక్పథాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా సొంతంగా ఎద‌గాల‌న్న కిర‌ణ్ ఆత్మవిశ్వాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ఇక కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటించిన కె - ర్యాంప్ సినిమాపై ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా, దీపావళి సీజన్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్‌పై మాట్లాడకుండా తన ఆలోచనాత్మక సమాధానంతో కిరణ్‌ అబ్బవరం మరోసారి తన మేధస్సు చూపించాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: