టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు . ఈ మధ్య కాలంలో నాగర్జున సినిమాల్లో హీరో గా నటించడం కంటే కూడా ఇతర హీరోల సినిమాల్లో అద్భుతమైన ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలలో నటించడానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలం లోనే నాగార్జున చాలా సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించాడు. ఇకపోతే నాగార్జున సోలో హీరోగా సినిమా చేసి చాలా కాలమే అవుతుంది.

ఆఖరుగా నాగార్జున నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించిన ఏ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాగే నాగార్జున ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే నాగార్జున తన 100 వ సినిమా కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే తన 100 వ సినిమాకు దర్శకుడిని ఫిక్స్ చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా సీనియర్ స్టార్ హీరోయిన్ నటించిన అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ బృందం నాగార్జున 100 వ సినిమా కోసం టబు , అనుష్క శెట్టి , నయనతార ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు , వీరి ముగ్గురులో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: