
ఇక, మరో ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా ఇదే పద్ధతి పాటించారు. కేంద్రంలో యూపీఏ పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు, 2జీ స్పెక్ట్రం కుంభకోణాలు వంటివి పెద్ద ఎత్తున దేశాన్ని కుదిపేశాయి. అయినా.. ప్రధానిగా మన్మోహన్ నోరు విప్పలేదు. అప్పట్లో ఆయన కూడా ఇలానే మాట్లాడారు. పీవీ శిష్యుడిగా పేరొందిన మన్మోహన్.. అదే బాటలో నడిచారు. ఆ సమస్యలు కూడా అలానే పెద్దవి కాకుండా పరిష్కారం అయ్యాయి. కొన్ని కాలంతోపాటు కలిసిపోయాయి. ఇక, ఇప్పుడు ఏపీలోనూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇదే సూత్రం పాటిస్తున్నారన్న వాదన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నప్పుడు.. చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కూటమిగా పార్టీలు ప్రభు త్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు .. చిన్న లోపం కూడా పెద్దదిగానే గోచరిస్తుంది. దీనిని పట్టుకుని యాగీ చేస్తే.. అసలుకు ఎసరు వస్తుంది. ఈ చిన్న లాజిక్‌ను మిస్సయిన కొన్ని కూటమి ప్రభుత్వాలు మధ్యంతరంగా కుప్పకూలిన సందర్భాలు అనేకం ఉన్నా యి. బహుశ ఇవన్నీ పాఠాలుగా వినియోగించుకుంటున్నారో..ఏమో పవన్ కల్యాణ్.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాల పై మౌనంగా ఉంటున్నారు. ఏకంగా తనపై వస్తున్న విమర్శలను కూడా ఆయన లైట్ తీసుకుంటున్నారు. సుగాలి ప్రీతి మాతృమూర్తి.. ఇటీవల చేసిన రాద్ధాంతం అంతా ఇంతాకాదు. అయినా.. పవన్ నోరువిప్పలేదు.
ఇక, క్షేత్రస్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు కొందరు వార్తల్లో నిలుస్తున్నారు. వారు చేస్తున్నారో.. లేక వారి తరఫున ఎవరైనా తప్పులు చేస్తున్నారో తెలియదు కానీ.. మొత్తానికి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక, ఒకచోట జనసేన ఎంపీపీని మిత్రపక్షం పార్టీ నేతలు కుమ్మేశారు. మరోవైపు పార్టీ బహిష్కృత నేతలు కూడా నోరు చేసుకుంటున్నారు. అయినప్పటికీ పవన్ మౌనంగా ఉంటున్నారు. సంయమనం పాటిస్తున్నారు.. ఇది కూడా ఒకరకంగా.. రోగమెరిగి మందు వేయడమే అవుతుందని అంటున్నా రు పరిశీలకులు. అంతేకాదు.. ఈ సంయమనంతో పార్టీని రోడ్డున పడేయకుండా.. చేస్తున్నారని.. కూటమిని కాపాడుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే వేరే పార్టీ అయి ఉంటే.. యాగీ చేసుకుని.. రోడ్డున పడేవారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు