టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి , ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆఖరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపుగా తన సినిమాల్లో ఇద్దరు హీరోలను పెడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో రెండవ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా రెండవ హీరోయిన్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా శ్రీ నిధి శెట్టి ని హీరోయిన్గా ఓకే చేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ మూవీ లో రెండవ హీరోయిన్ పాత్ర కూడా ఉన్నట్లు , అందులో ఐశ్వర్య రాజేష్ ను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ , వెంకటేష్ సినిమా విషయంలో కూడా తన ఓల్డ్ ఫార్ములా నే ఫాలో కాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: