ఇప్పుడు ఆయన కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ టర్న్ రాబోతోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు సంజయ్ విజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఓ బైలింగ్వెల్ (తెలుగు – తమిళ్) మూవీ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది సంజయ్ విజయ్‌కి డైరెక్టర్‌గా డెబ్యూ ఫిల్మ్. అంటే దళపతి విజయ్ వారసుడు దర్శకుడిగా మొదటి అడుగు వేస్తున్న ప్రాజెక్ట్ ఇది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల డైరెక్టర్‌గా డెబ్యూ చేసినట్టే, ఇప్పుడు దళపతి విజయ్ కుమారుడు కూడా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం కోలీవుడ్‌లో భారీ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. అందుతున్న సమాచారం ప్రకారం, ఇటీవల విజయ్ రాజకీయ రంగ ప్రవేశం, పార్టీ కార్యకలాపాలు, అలాగే ఆయన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కొంత వాయిదా పడిందట. అయినప్పటికీ, త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదే సమయంలో సందీప్ కిషన్ మరో ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేశాడు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా టైటిల్‌ను ‘పవర్ పేట’ అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ కోసం నిరంతరం కృషి చేస్తున్న సందీప్, తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికే మంచి స్థానం సంపాదించాడు. సంజయ్ – సందీప్ కిషన్ కలయిక ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో, ఈ సినిమా సందీప్ కెరీర్‌కు ఎంత పెద్ద టర్నింగ్ అవుతుందో చూడాలి...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి