- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కలయికలో రూపొందిన బాహుబలి సిరీస్‌ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు భాగాలనూ మళ్లీ రీ-ఎడిట్ చేసి, రీ-మాస్టర్ చేసి “బాహుబలి ది ఎపిక్” పేరుతో రీరిలీజ్ చేయడం సినీప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఎపిక్ చిత్రం ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుక్ మై షో ప్లాట్ ఫామ్‌లో ఈ సినిమాకి అదిరిపోయే బుకింగ్స్ న‌మోదు అవుతున్నాయి. రిలీజ్‌కు ముందు రోజే ప్రీ-సేల్స్ లో సుమారు లక్ష టికెట్లు అమ్ముడైపోయాయని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.


మొత్తం ప్రీ-సేల్స్ కలిపి మూడు లక్షలకు పైగా టికెట్లు సేల్ అయినట్టు సమాచారం. ఇది రీరిలీజ్ సినిమా కోసం నిజంగా రికార్డ్ స్థాయి ఫీట్‌గా చెప్పుకోవాలి. ఈ రోజు బాహుబ‌లి - ది ఎపిక్ పూర్తి స్థాయి రీరిలీజ్ జరగడంతో దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద భారీ హడావిడి నెలకొంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో షోలు హౌస్‌ఫుల్‌గా మారాయి. యూఎస్ మార్కెట్లో కూడా బాహుబలి ది ఎపిక్ హవా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇతర భాషా వెర్షన్లలోనూ ఈ సినిమాకి ప్రేక్షకులు నుంచి గట్టి రెస్పాన్స్ వ‌స్తోంది.


హవర్‌లీ బుకింగ్స్‌లో కూడా బాహుబలి పేరు ట్రెండ్ అవుతుండటం రాజమౌళిప్రభాస్ కాంబినేషన్ చేసిన ప‌దేళ్ల నాటి మ్యాజిక్ ఇంకా తగ్గలేదని రుజువు చేస్తోంది. ఈ రన్ ఎక్కడ వరకు కొనసాగుతుందో, మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. “ బాహుబలి ది ఎపిక్ ” మరోసారి భారత సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలవబోతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: