ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ... వివేక్ , మార్విన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 28 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను ఒక్కో దానిని ఈ మూవీ బృందం వారు విడుదల చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పాటలను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి చిన్ని గుండెలో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ మూవీ లోని చిన్ని గుండెలో సాంగ్ కి విడుదల అయిన తర్వాత అత్యంత వేగంగా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి రావడం మొదలు అయింది.

దానితో విడుదల అయిన 24 గంటల్లో ఈ సినిమాలోని చిన్ని గుండెలో సాంగ్ కి  అదిరిపోయే రేంజ్ వ్యూస్ , లైక్స్ వచ్చాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ లోని చిన్న గుండెలో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 15.1 మిలియన్ వ్యూస్ ... 150.1 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని చిన్ని గుండెలో సాంగ్ కి విడుదల అయిన 24 గంటలు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు. రామ్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. దానితో ఈయన అభిమానులు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ తో రామ్ అద్భుతమైన విజయాన్ని అందుకొని మళ్లీ సూపర్ ఫామ్ లోకి వస్తాడు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: