అంజలి చాలా మంచి అమ్మాయి, కానీ ఆమె జీవితంలోకి హీరో జై వచ్చిన తర్వాత ట్రాక్ తప్పింది. కొడైకెనాల్ కు షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు హీరో, హీరోయిన్లకు వేర్వేరు రూమ్స్ బుక్స్ చేశాం. కానీ జై, అంజలి మాత్రం ఓకే రూమ్ లో ఉండేవారు. సరే మరో రూమ క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాదని నందకుమార్ తెలిపాడు. జై పెట్టిన కండీషన్ తో ఆ రూమ్ కి కూడా రోజుకు 12000 రూపాయలు చొప్పున అద్దె చెల్లించాము. షూటింగ్ లో అంజలిని పేరు పెట్టి పిలిస్తే జై గొడవపడేవాడు.. 'మేడమ్' అనే పిలవాలని.. లేకుంటే షూటింగ్ ఆపేస్తానని బెదిరించేవాడని చెప్పారు.
ఒకరోజు అంజలి షూటింగ్ కు రాలేదు. మేం ఆమెకు చాలా సార్లు ఫోన్ చేసినా తీయలేదు. చివరకు ఆమె ఫోన్ చేసి కడుపు నొప్పిగా ఉందని చెప్పింది. మేం ఆమె రూముకు కారుని కూడా పంపాం. కానీ జై, అంజలి అదే కారులోనే ఎయిర్ పోర్టుకు వెళ్ళి.. అక్కడ నుండి చెన్నై వెళ్ళిపోయారు. మా షూటింగ్ ఆగిపోయింది. జై ప్రవర్తన కారణంగా నేను నష్టపోయాను" అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు. ఇంతగా క్లోజ్ గా ఉన్న జై అంజలి మాత్రం ఆ తర్వాత విడిపోయారు. ఆ హీరో జయమని మోసం చేశాడని అంతా అనుకున్నారు. అసలు వాస్తవం ఏంటో వారికే తెలియాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి