టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు చాలా తక్కువ సినిమాల ద్వారా మంచి విజయాలు దక్కాయి. ఈయనకు విజయాలు చాలా తక్కువ ఉన్నా కూడా ఈయన ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలలో నటించ కుండా కాస్త డిఫరెంట్ కథాంశాలతో రూపొందే సినిమాలలో నటిస్తూ రావడంతో ఈయనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా సుధీర్ బాబు "జటాధర" అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సోనాక్షి సిన్హా ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయదు అని , ఈ సినిమా భారీ డిజాస్టర్ను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా మాత్రం మంచి కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దోచుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8.50 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి భారీ నెగటివ్ టాక్ వచ్చిన ఈ స్థాయి కలెక్షన్లు రావడంతో కాస్త మంచి టాక్ ఈ సినిమాకు గనుక వచ్చి ఉంటుంటే ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకునేది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: