ఇంతకాలం విరామం తర్వాత, ఇప్పుడు ఈ హిట్ జోడీ మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజశేఖర్ తాజాగా చేస్తున్న సినిమాలో రమ్యకృష్ణ ఆయనకు జోడీగా కనిపించనుందట. ఈ చిత్రం తమిళ హిట్ మూవీ లబ్బర్ పందుకి అధికారిక రీమేక్‌గా రూపొందనుందనే సమాచారం. గ్రామీణ నేపథ్యంతో క్రికెట్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఒరిజినల్ వెర్షన్‌లో హీరో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ పోషించబోతున్నారు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే… ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తెనే హీరోయిన్‌గా నటించనుందట. తమిళంలో శ్వాసిక చేసిన పాత్రను తెలుగులో రమ్యకృష్ణ సొంత శైలిలో ఆవిష్కరించబోతున్నారు. పిట్టగోడ, 35 సినిమాల్లో నటించిన విశ్వదేవ్ రాచకొండ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు ? అన్నది మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. రాజశేఖర్ చివరిసారి నటించిన శేఖర్ సినిమాను ఆయన భార్య జీవిత డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఆమెనే మెగాఫోన్ పట్టే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు రీమేక్ సినిమాలే రాజశేఖర్‌కు మంచి విజయాలు అందించాయి. కానీ ఇటీవలి కాలంలో గడ్డం గ్యాంగ్, శేఖర్ వంటి రీమేక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అలాంటి అనుభవాల తర్వాత కూడా ఆయన మరోసారి రీమేక్ రిస్క్ తీసుకోవడం ఆసక్తికరమే. ఈ ప్రయత్నం ఫలిస్తుందా? లేక మళ్లీ అదే సమస్యలు ఎదురవుతాయా? అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి