నేడు మహర్షి మూవీ సహనిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్ లోని దిల్ రాజు ఇంటితో పాటు ఆయన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే  బృందాలుగా విడిపోయిన అధికారులు ఇంటితో పాటు ఆఫీసులను రికార్డులను పరిశీలించారు. 

మహర్షి సినిమా బిజినెస్ భారీ స్థాయలో జరిగినట్లు సమాచారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.   గతంలో చెల్లించిన పన్ను, కలెక్షన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఐటీ దాడులను దిల్ రాజు లైట్ తీసుకున్నారు. 


తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ..ఐటీ దాడులు జరగడం అన్నది కామన్. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.  అంతే కాదు ఇలాంటి విషయాలు వైరల్ గా చేసి ఎలాంటి కాంట్రవర్సీలు సృష్టించవొద్దని ఆయన కోరారు. 

 మహేశ్ బాబు, పూజాహెగ్డే జంటగా, ప్రకాశ్ రాజ్, ప్రధాన పాత్రలో అల్లరి నరేశ్ నటించిన ఈ సినిమాను వంశీ పైడిపల్లి రూపొందించగా, దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: