కూటమి ప్రభావం ఈసారి కోస్తా జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలంగా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక రాయలసీమలోను గత ఎన్నికలలో వైసీపీకి ఉన్నంత వేవ్‌ ఈసారి లేదంటున్నారు. సీమ జిల్లాలు ఎలా ఉన్నా కడప జిల్లాలో మాత్రం వైసిపి ఆధిపత్యం అని అందరూ అంగీకరిస్తారు. ఇప్పటికీ ఇదే పరిస్థితి. జిల్లా మొత్తం పక్కన పెడితే.. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో కచ్చితంగా వైసీపీదే గెలుపు అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. అయితే ఈసారి పరిస్థితి అంత సానుకూలంగా లేదు. డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఓటమికి ఎదురీదుతున్నారు. ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన భాషాపై వైసీపీ క్యాడర్లోనే కాదు.. నియోజకవర్గ ప్రజల్లోను తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.


వైఎస్ కుటుంబం పై అభిమానంతో పార్టీ విజయానికి సహకరించిన కడప కార్పొరేటర్లు ఇప్పుడు అంజాద్  భాష తీరుపై అసంతృప్తితో పార్టీలు మారిపోయారు. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వైయస్ హయాం నుంచి కడప కాంగ్రెస్‌కు ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉండేది. టీడీపీ అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన.. 2004 ఎన్నికల నుంచి ఇక్కడ సీన్ పూర్తిగా మారింది. నాలుగుసార్లు వరుసగా వైఎస్ ఫ్యామిలీ ఎవరిని నిలబెడితే వాళ్లే ఎమ్మెల్యేలు అయ్యారు. 2004, 2009 ఎన్నికలలో వైఎస్ అండదండలతో అహ్మదుల్లా రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. 2014లో కార్పొరేటర్ గా ఉన్న అంజాద్ బాషాకు జగన్ సీటు ఇచ్చారు.


ఆ ఎన్నికలతో పాటు 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అరాచకాలకు.. ఆయన కుటుంబ సభ్యులు చేసిన దందాలకు.. అంతేలేకుండా పోయిందన్న విమర్శలు వచ్చేసాయి. ఇక సొంత పార్టీ క్యాడర్‌ను కూడా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇక టిడిపి నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవి రెడ్డికి సీటు ఇచ్చాక.. ఇక్కడ రాజకీయం చాలా వరకు మారిపోయింది. ఆమె ఇన్చార్జిగా వచ్చినప్పటి నుంచి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల మహిళల్లో కూడా ఆమె ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నారు.


ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అంజాద్ బాషా చేసిన అరాచకాలు నిర్వాకాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బయటకు వచ్చేలా చేసి తాను గెలుస్తున్నాను అనే మాట బయటకు వచ్చేలా చేశారు. ఇక్కడ గెలుపు, ఓటములు ఎలా ఉన్నా ? మాధవి గెలుస్తుంది అన్న చర్చ మొదలైందంటేనే వైసీపీకి ఎంత కష్ట కాలమో అర్థమవుతుంది. ఇక వైసిపి కార్పొరేటర్లు తమ డివిజన్లో అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు ఇవ్వక... ఎవరిని అడగాలో తెలియక తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఎన్ని కంచుకోటలు ఉన్న టీడీపీలో బలమైన నాయకత్వం ఉంటే టీడీపీ గెలిచే పరిస్థితి వస్తుంది అని చెప్పేందుకు మాధవి రెడ్డి పెద్ద ఉదాహరణ. ఏది ఏమైనా కడపలో గెలుపు అయితే వైసీపీకి అంత ఈజీ కాదు. ఈ క్రెడిట‌ట్ అంతా టీడీపీ మాధవి రెడ్డిదే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: