అమెరికాలో రోజు రోజుకు కరోన కేసుల సంఖ్య ఉదృతం అవుతోంది. కేసుల సంఖ్యతో పాటుగా మృతుల సంఖ్య పెరిగిపోవడంతో అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ మహమ్మారి చైనాలో పుట్టినా అమెరికాలో మాత్రం తీవ్ర రూపం దాల్చుతోంది. దాదాపు అన్ని దేశాలపై కరోనా ప్రభావం చూపించినా అక్కడి ప్రభుత్వ చర్యల కారణంగా, ప్రజల సహకారంతో విజయవంతగా ఎదుర్కుంటున్నాయి. కానీ అమెరికాలో మాత్రం కరోనా మరణాలలో రికార్డ్ లు సృష్టిస్తోంది
ప్రజలు ఎదేశ్చగా తిరగడమే కాకుండా కనీస జాగ్రత్తలు పాటించక పోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు నిపుణులు..
అమెరికాలో కేవలం నిన్న ఒక్కరోజులో 4470 మంది కరోనా తో మృతి చెందటంతో తీవ్ర కలకలం రేగుతోంది. న్యూ ఇయర్, క్రిస్మస్ సందర్భంగా ఏ ఒక్కరూ  బయటకు రావద్దని ఇళ్లకే పరిమితం అవ్వాలని,. దూర ప్రయాణాలు చేయడం దాదాపు మానేయాలని, న్యూ ఇయర్ వెళ్ళే వరకూ ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు  ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని పౌచీ. సుమారు రెండు నెలల క్రితమే అమెరికన్స్ ను హెచ్చరించగా ఏ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోక పోవడంతోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన చెందారు. ఇదిలాఉంటే
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎన్నారైల కుటుంభ సభ్యులు, తల్లి తండ్రులు ఆందోళన  చెందుతున్నారు. ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో కరోనా ప్రభావం లేదని, అభివృద్ధి చెందిన దేశంలో, పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికాలో అదీ కూడా పూర్తిగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న అమెరికాలలో కేసులు పెరిగిపోవడం వారికి మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. కేవలం నిన్న ఒక్కరోజులోనే 1. 31 లక్షల మందికి కరోనా సోకిందని ఇప్పటి వరకూ కరోనా కారణంగా 2.36 కోట్ల మంది ఆసుపత్రి  పాలయ్యారని, సుమారు ౩.90 లక్షల మంది మృతి చెందారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: