ప్యారడైజ్ పేపర్ల ఆధారంగా టీడీపీ జగన్ మీద అనవసర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన మీద చేసిన విమర్శలు, ఈ ప్యారడైజ్ పేపర్ల విషయం లో తన పేరు - తను తప్పు చేసాను అంటున్న మాటలు నిరూపిస్తే ఏదైనా చెయ్యడానికి సిద్దమే అంటూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఈ సవాల్ మీద ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్పందిస్తూ వస్తున్నారు.

ఆధారాలు లేకుండా మాట్లాడలేక కొందరు జగన్ దొంగా దొంగా అంటూ అరవడం మొదలు పెట్టారు. అయితే వర్ల రామయ్య స్పందనే కాస్త వింతగా ఉంది. 15 రోజుల్లో అ ఆరోపణలు నిరూపించాలి అని జగన్ చేసిన సవాల్ కి బదులు ఇస్తూ ఈ సవాల్ ను చంద్రబాబుకు కాకుండా సీబీఐ లేదా ప్యారడైజ్ లేదా వికీలీక్స్ లేదా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లకు విసరాలని జగన్ కు సూచించారు.

అలా కాకుండా బాబు నిరూపించాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.తన దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి అనీ తనతో చర్చ కి జగన్ సిద్ధం అవ్వాలి అనీ దమ్ముంటే ఈ విషయం లో తనని ఎదిరించి నిలబడాలి అని జగన్ కి సవాల్ విసిరారు రామయ్య.

నిజంగా జగన్ లాంటి ఒక ప్రధాన ప్రతిపక్షం నాయకుడి కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్ విషయం లో ఆధారాలు ఉండి ఇంకా సైలెంట్ గా ఎవరైనా ఉంటారా ? నిరూపించే సాక్ష్యాలు ఉండీ… కూడా నాన్చడం సరైనదేనా? చర్చిస్తే నిరూపిస్థా అంటే చర్చించకపోతే నిరూపించవా? మరి అవినీతి గురించి తెలిసి పట్టించ కలిగి కూడా అలా చేయకపోతే… చట్ట ప్రకారం అది కూడా తప్పే కదా ఆ పాయింట్ ఎందుకు ఆలోచించడం లేదు టీడీపీ వారు? 


మరింత సమాచారం తెలుసుకోండి: